“పుష్ప”తో మరో భారీ రికార్డు సెట్ చేసిన బన్నీ.!

Published on Jun 4, 2021 3:01 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. బన్నీ మరియు సుకుమార్ ల కాంబోలో వస్తున్న మూడో సినిమా అనే కాకుండా ఇంటెన్స్ స్టోరీ లైన్ తో బాక్సాఫీస్ షేక్ చెయ్యడానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం అంచనాలు అంతకంతకు పెంచుకుంటూ వస్తుంది.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ భారీ స్థాయి రికార్డులు తెలుగులో సెట్ చేస్తుంది. మామూలుగానే బన్నీ వీడియోస్ కి సోషల్ మీడియాలో భయంకరమైన రెస్పాన్స్ వస్తుంది. మరి అలాంటిది ఈ చిత్రం టీజర్ కు ఇపుడు ఏకంగా మొట్టమొదటి 70 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి సరికొత్త లెక్కలను పరిచయం చేసింది.

దీనితో ఈ సెన్సేషనల్ రికార్డు అందుకు టాలీవుడ్ ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ హీరోగా బన్నీ నిలిచాడు. మరి ఈ మాస్ స్పీడ్ ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :