జనవరి 20నుండి బన్నీ, త్రివిక్రమ్ తాజా షెడ్యూల్

జనవరి 20నుండి బన్నీ, త్రివిక్రమ్ తాజా షెడ్యూల్

Published on Jan 17, 2015 11:30 PM IST

Trivikram-alluarjun1
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే ఒక విజయం నమోదయ్యి మరో ప్రాజెక్ట్ ని తెరమీదకు తీసుకొచ్చే పనిలో వున్న విషయం తెలిసినదే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 20నుండి మొదలుకానుంది. సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్య సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ యొక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. వేసవిలో ఈ సినిమాను మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్నాడు. సమంతా, అదా శర్మ మరియు నిత్యా మీనన్ లు హీరోయిన్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు