కోకపేటలో బన్ని – త్రివిక్రమ్ ల సందడి

కోకపేటలో బన్ని – త్రివిక్రమ్ ల సందడి

Published on Nov 21, 2014 11:00 AM IST

Trivikram-alluarjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ అయిన ‘జులాయి’ మూవీ తర్వాత ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిఎన్మా షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం కోకపేటలో ఓ స్పెషల్ ని వేసారు. ప్రస్తుతం ఆ సెట్లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అల్లు అర్జున్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జులాయి చిత్ర నిర్మాత అయిన కె. రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ స్టార్ ఉపేంద్ర, స్నేహ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు