సోషల్ మీడియాలో ‘ఇడుపు కాయితం’ వివాదం.. బన్నీ వాస్ రెస్పాన్స్ ఇదే..!

సోషల్ మీడియాలో ‘ఇడుపు కాయితం’ వివాదం.. బన్నీ వాస్ రెస్పాన్స్ ఇదే..!

Published on Jun 27, 2026 6:05 PM IST

ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ సమర్పిస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ మరియు కథా నేపథ్యంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తుండగా.. ఇది కాస్తా ఆంధ్రా వర్సెస్ తెలంగాణ ప్రాంతీయ వివాదంగా మారి నెట్టింట దుమారం రేపుతోంది.

ఈ వివాదంపై నిర్మాత బన్నీ వాస్ తాజాగా స్పందించారు. సినిమా టైటిల్ అనేది ఎప్పుడూ కథను బట్టి, ఆ కథ జరిగే ప్రాంతాన్ని బట్టి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ‘నేను కేవలం సినిమాపైనే దృష్టి పెడుతున్నాను తప్ప చుట్టూ జరుగుతున్న హడావుడిని పట్టించుకోవడం లేదు. ఆంధ్రా ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా సినిమా బాగుంటేనే చూస్తారు. ఒక మంచి సినిమాను అందించడమే నా బాధ్యత’ అని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు.

సినిమా కంటెంట్ బాగుంటే ఈ వివాదాలన్నీ మర్చిపోతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కథ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదని, అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిపారు. అలాగే, రెమ్యూనరేషన్ ఇబ్బందులు లేకుండా కొత్త టాలెంట్‌తో పనిచేయడమే బెటర్ అని భావించి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు