అల్లు అర్జున్ ని ‘సరైనోడు’గా మార్చిన బోయపాటి శ్రీను.?

అల్లు అర్జున్ ని ‘సరైనోడు’గా మార్చిన బోయపాటి శ్రీను.?

Published on Aug 4, 2015 12:37 PM IST

Allu-arjun-boyapati
‘S/O సత్యమూర్తి’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జూలై 29 నుంచి తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. టాలీవుడ్ టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకరైన బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలై వారం రోజులే అయినప్పటికీ ఈ చిత్ర టీం ఈ మూవీ టైటిల్ ని ఫిక్స్ చేసారు. తన ప్రతి సినిమాకి పవర్ఫుల్ టైటిల్ పెట్టే బోయపాటి శ్రీను ఈ సినిమాకి కూడా ఓ పవర్ఫుల్ టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ కోసం ‘సరైనోడు’ అనే టైటిల్ ని బోయపాటి ఫిక్స్ చేసాడని ఈ చిత్రతెం అంటోంది. అతి త్వరలోనే ఈ టైటిల్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఎక్కువగా క్లాస్ టైటిల్స్ వైపు అడుగేసే అల్లు అర్జున్ కి మాస్ టైటిల్స్ చాలా తక్కువ సార్లు పడ్డాయి. కానీ ఇది అవుట్ అండ్ అవుట్ లవ్ అండ్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో బోయపాటి శ్రీను పెట్టిన టైటిల్ సినిమాకి బాగా సూట్ అవుతుందని ఆడియన్స్ అంటున్నారు. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ మరియు పాత్ర ఈ టైటిల్ మాదిరిగానే చాలా పవర్ఫుల్ గా ఉంటుందనిబోయపాటి శ్రీను టీం అంటోంది. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు