బన్నీ కుమారుడి తెరంగేట్రం!

బన్నీ కుమారుడి తెరంగేట్రం!

Published on Mar 10, 2015 3:24 PM IST

allu-arjun-son-ayaan (1)
ఏంటి.. అల్లు అర్జున్ కుమారుడు తెరపై కనిపించనున్నాడా ? అనే ప్రశ్నకు ఫిల్మ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. అల్లు అర్జున్ తాజా చిత్రం సన్నాఫ్ సత్యమూర్తిలో అయాన్‌ను తెరపై చూడొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదెంతవరకూ నిజమన్నది ఇంకా అధికారికంగా తెలియలేదు. అయితే.. అభిమానులు మాత్రం అప్పుడే సంబరాల్లో మునిగిపోయారు. అల్లు అర్జున్, స్నేహాల కుమారుడు అయాన్ ఫోటోలు సోషల్ మీడియాలో మంచి ఆసక్తిని, అటెన్షన్‌ని రేకెత్తిస్తుంటాయి. పండుగలు, రకరకాల సందర్భాలను పురస్కరించుకొని అయాన్ ఫోటోలను విడుదల చేయడం, ఆ ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి స్పందన రావడం చూస్తూనే ఉన్నాం.

ఇప్పుడిక ఏకంగా వెండితెరపైనే అయాన్ కనిపించనున్నాడన్న విషయం విశేషంగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం మేరకు బాలీవుడ్ సినిమాల్లోలా సినిమా అయిపోయిన తర్వాత చూపించే దృశ్యాల్లో అయాన్‌ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సన్నాఫ్ సత్యమూర్తి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈనెల 15న ఆడియో విడుదల వేడుక జరగనుంది. ఏప్రిల్ 2న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు