బుర్రకథ పూరిని దెబ్బకొట్టదు కదా

Published on Jun 26, 2019 1:06 pm IST

ఈ వారం విడుదలకానున్న సినిమాల్లో ఆది సాయి కుమార్ నటించిన ‘బుర్రకథ’ కూడా ఒకటి. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే రెండు మైండ్ సెట్స్ కలిగిన ఒక కుర్రాడి కథ అని అర్థమవుతోంది. అయితే అచ్చు ఇలాంటి డబుల్ దిమాక్ థీమ్ తీసుకునే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ హీరో.

జూలై 18న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అంటే కేవలం 22 రోజుల గ్యాప్. ఇలా కొద్ది రోజుల వ్యవధిలోనే ఒకే తరహా కథతో రెండు సినిమాలు రావడం ఇబ్బందికరమైన అంశమే. ఈ ఇబ్బంది ఎక్కువగా పురిగారికే ఉండనుంది. ఎందుకంటే ‘బుర్రకథ’ ముందే వస్తోంది.. ఈ సినిమా చూసిన జనం ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా అదే తరహాలో ఉంటే ఇందులో కొత్తేముంది, కొన్ని రోజుల క్రితమే కదా ఇలాంటి సినిమానే చూశాం అనే ప్రమాదముంది. కాబట్టి పూరి తన హీరో క్యారెక్టరైజేషన్, టేకింగ్, స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తే కాన్సెప్ట్ ఒకటే అయినా ‘బుర్రకథ’ ప్రభావం నుండి తప్పించుకునే వీలుంటుంది.

సంబంధిత సమాచారం :

X
More