‘బుర్రకథ’ జూన్ 29 కూడా కష్టమే !

Published on Jun 27, 2019 3:59 pm IST

రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ‘ఆది’ హీరోగా రాబోతున్న చిత్రం ‘బుర్రకథ’. రెండు మెద‌ళ్ల‌తో పుట్టిన హీరో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నే కాన్సెప్ట్‌ తో ఈ సినిమా తెరకెక్కింది. కాగా మొదట ఈ సినిమాను జూన్ 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ సెన్సార్ ఇష్యూస్ కారణంగా విడుదల తేదీ జూన్ 28 నుండి జూన్ 29కి షిఫ్ట్ అయిందని నిన్న చిత్రబృందం తెలిపింది.

అయితే తాజా సమాచారం ప్రకారం జూన్ 29వ తేదీ కూడా సినిమా విడుదల కావట్లేదని తెలుస్తోంది. ఇక చిత్రబృందం మాత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెబుతున్నారు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ ను వింటేజ్ క్రియేష‌న్స్ ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకుని సినిమాను విడుదల చేస్తోంది.

ఈ చిత్రాన్ని దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌ పై హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో ఆది సరసన మిస్తీ చక్రబోర్తి , నైరా షా హీరోయిన్స్ గా నటిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More