పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వేడుకలకు హాజరుకావడం చాలా అరుదు. అప్పుడప్పుడు తమ కుటుంబ హీరోల వేడుకలకు, నితిన్ లాంటి ఒకరిద్దరు ఇతర హీరోల సినిమా ఫంక్షన్లకు మాత్రమే ఎప్పుడో ఒకసారి హాజరయ్యే ఆయన ఈ మధ్య పంథా మార్చి తరచూ వేడుకల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే జరిగిన ‘రంగస్థలం’ సక్సెస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన మనసు విప్పి మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.
అదే తరహాలో ఈరోజు కూడ ఆయన తమ ఫ్యామిలీలో హీరో అల్లు అర్జున్ యొక్క ‘నా పేరు సూర్య’ సక్సెస్ మీట్, తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రవితేజ తాజా చిత్రం ‘నేల టికెట్టు’ ఆడియో వేడుకలకు హాజరుకానున్నారు. ఈ రెండిటిలో ముందుగా బన్నీ సినిమా వేడుకకు హాజరై అనంతరం రవితేజ సినిమా ఆడియో లాంచ్ కు వెళ్లనున్నారు పవన్. ఇలా ఒకేసారి రెండు ఈవెంట్లకు పవన్ వెళుతుండటంతో అభిమానులు కూడ రెండు వేదికల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోనున్నారు.


