ఈ దశాబ్దంలోనే మోస్ట్ వైరల్ సాంగ్ గా “బుట్ట బొమ్మ”.!

Published on Mar 18, 2021 8:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అల వైకుంఠపురములో”. బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే.

మరి ఈ చిత్రానికి థమన్ ఇచ్చిన సంగీతం కూడా ఎలాంటి సెన్సేషన్ ను నమోదు చేసిందో కూడా తెలిసిందే. ముఖ్యంగా కొన్ని పాటలు అయితే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అందుకే ఈ సినిమా ఆల్బమ్ భారీ వ్యూస్ ను అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని బుట్ట బొమ్మ సాంగ్ ఖండాంతరాల్లో కూడా హిట్టయ్యింది.

మరి అందుకే ఈ సాంగ్ ను తెలుగులో ఈ దశాబ్దంలోనే మోస్ట్ వైరల్ గా నిలిచింది అని మిర్చి అవార్డ్స్ వారు ఈ పాటను పాడిన అర్మాన్ మాలిక్ కు అవార్డు అందించారు. దీనితో ఈ వార్తను అర్మాన్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నాడు. అలాగే తన టీం అంతటికీ తన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నాని తెలిపాడు.

సంబంధిత సమాచారం :