‘అఖండ 2’లో షాకింగ్ సర్ప్రైజ్.. మహాశివుని రుద్ర తాండవంలో ఎవరంటే!?

Akhanda 3

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న లేటెస్ట్ చిత్రమే “అఖండ 2 తాండవం”. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేస్తున్న ఈ అవైటెడ్ సినిమా ఎట్టకేలకి విడుదలకి రాబోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా మొత్తం పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా వస్తుంది. ఇక ఈ రిలీజ్ కి ముందు షాకింగ్ సర్ప్రైజ్ కోసం సినీ వర్గాల్లో రచ్చ నడుస్తుంది.

అఖండ సినిమాలో ప్రధానంగా ఉన్న దైవత్య అంశమే పరమశివుని కోసం. అలాంటిది పార్ట్ 1 లో జస్ట్ ఒక్క ఫ్రేమ్ బాలయ్యపై చూపిస్తే థియేటర్స్ దద్దరిల్లాయి. ఇక ఇప్పుడు పార్ట్ 2 లో బోయపాటి అంతకుమించి ప్లాన్ చేశారట. ఈసారి పరమశివునిగా రుద్ర తాండవం చేసేది ఎవరో కాదు సీనియర్ ఎన్టీఆర్ అట. ఇదెలా సాధ్యం అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ గా మారిందో చూస్తూనే ఉన్నాము.

అలా కృతిమ మేధస్సు (AI – ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా నందమూరి తారక రామారావుని చూపించనున్నారట. ఇది ఎంతవరకు నిజమో కానీ నిజమైతే మాత్రం థియేటర్స్ లో అభిమానులకి పెద్ద పండుగే అని చెప్పాలి. దానికి తోడు 3D లో కూడా ఉంది కాబట్టి విజువల్ ట్రీట్ ఇంకో లెవెల్లో ఉంటుంది అని చెప్పవచ్చు. సో దీనిపై అధికారిక క్లారిటీ ఒకటి బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version