
తండ్రి నందమూరి తారకరామారావుగారినుండి ఉనికిపుచ్చుకున్న రాజసాన్ని వెండితెరపై 4 దశాబ్దాలకు పైగా నిలబెడుతూ లెక్కలేనన్ని హిట్లను మనకు అందించిన నటుడు బాలకృష్ణ. మాస్ ఆడియన్స్ కి దేవుడిగా అభివర్ణింపబడే బాలయ్య బాబు ప్రస్తుతం ‘లయన్’ సినిమాకు ఫినిషింగ్ టచ్ లు ఇస్తున్నాడు. దీని తరువాత ప్రారంభంకానున్న అతని 99వ సినిమా డిక్టేటర్ ని శ్రీవాస్ తెరకెక్కించనున్నాడు.
అయితే చారిత్రాత్మకమైన తన 100వ సినిమాను బోయపాటి శ్రీను చేతిలోపెట్టినట్టు సమాచారం. ఈ చిత్రానికి చరిత్రకు ఒక్కడు అనే నామకరణం చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెండు అగ్ర నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం మొదలయ్యే సూచనలు వున్నాయి.

