‘ది ప్యారడైజ్’ నెక్స్ట్ సాంగ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!

‘ది ప్యారడైజ్’ నెక్స్ట్ సాంగ్ డేట్ ఫిక్స్ అయ్యిందా!

Published on Apr 28, 2026 2:01 PM IST

The-Paradise

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా పలు వాయిదాలు కావాల్సి వచ్చింది. ఇక ఈ గ్యాప్ లో వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ సెన్సేషన్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో అనిరుద్ నెక్స్ట్ సాంగ్ కోసమే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ నెక్స్ట్ సాంగ్ పై ఇప్పుడు సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ప్యారడైజ్ నుంచి తదుపరి పాట ఈ మే 10 న విడుదల చేయనున్నట్టు ఇప్పుడు టాక్. అలాగే ఇది కూడా మంచి రొమాంటిక్ నెంబర్ అన్నట్టు తెలుస్తుంది. సో అనిరుద్ ఈసారి ఎలాంటి ట్రీట్ అందివ్వనున్నాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబు తదితరులు నటిస్తుండగా ఈ ఆగష్టు 27న సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

తాజా వార్తలు