భాగ్యశ్రీ కి బంపర్ ఆఫర్.. నెక్స్ట్ ఆ హీరోతో ఛాన్స్..?

భాగ్యశ్రీ కి బంపర్ ఆఫర్.. నెక్స్ట్ ఆ హీరోతో ఛాన్స్..?

Published on Aug 8, 2026 12:02 AM IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘బ్లడీ రోమియో’. నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్‌ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో నాని సరసన యంగ్ అండ్ టాలెంటెడ్ నటి భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ఈ మధ్యే ‘లెనిన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న భాగ్యశ్రీ బోర్సే, తన పారితోషికాన్ని పెంచినట్లు టాక్.

ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌లో అనేక అవకాశాలు వస్తున్నప్పటికీ, కథ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటోంది. అందులో నాని ‘బ్లడీ రోమియో’ చిత్రానికే ఆమె మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు