టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘RAPO23’ చిత్రంతో సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక నటుడిగానే కాకుండా, ఈ నియో-నాయర్ థ్రిల్లర్ చిత్రానికి రామ్ స్వయంగా కథను అందించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టడం విశేషం. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, నిశ్శబ్దంగా ఈ సినిమా షూటింగ్‌ను ఆయన ఇప్పటికే ప్రారంభించేశాడు.
ఈ చిత్రానికి సంబంధించిన కాస్టింగ్ గురించిన వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా సంయుక్తా మీనన్ నటిస్తున్నట్లు గతంలోనే వార్తలు రాగా, తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ ఇందులో ప్రధాన విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆయన పాత్రను అత్యంత పవర్‌ఫుల్ గా, అద్భుతంగా డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
రామ్ పోతినేని ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని పంచేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా మలుస్తున్నాడు. ఇదొక డార్క్, ఇంటెన్స్ మరియు ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. కృష్ణ పోతినేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.


