న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాను ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అయితే, ఇటీవల ఈ చిత్ర నైజాం రైట్స్ కోసం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ ఆఫర్ ఇచ్చాడని.. ఈ సినిమాను నైజాంలో ఆయన రిలీజ్ చేస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, ఇందులో ఎలాంటి నిజం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు మరోసారి నైజాం రైట్స్ పై సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ వారు ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారని.. వారు మేకర్స్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ రైట్స్ విషయంలో మేకర్స్ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై త్వరలోనే ఓ అధికారికి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
