యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ విడుదలకు సిద్ధమవుతోంది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న అయోమయాన్ని దూరం చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని సెప్టెంబర్ 3న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై చిత్ర యూనిట్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చారిత్రక నేపథ్య చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం నిఖిల్ గుర్రపు స్వారీ, కత్తి సాము వంటి యుద్ధ విద్యలలో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


