మాస్ ఇమేజ్‌తో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్, రొటీన్ మాస్ టెంప్లేట్ సినిమాలకు ప్రేక్షకులు దూరమవుతున్న తరుణంలో తన రూట్ మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. ‘దేవర’ లాంటి చిత్రాలు మెప్పించినా, కెరీర్‌ను వైవిధ్యభరితంగా మార్చుకోవడానికి వెంకీ అట్లూరి వంటి క్లాస్ డైరెక్టర్‌తో పనిచేస్తే బాగుంటుందనే చర్చ నడుస్తోంది.
గతంలో త్రివిక్రమ్‌తో చేసిన ‘అరవింద సమేత’ ఎన్టీఆర్‌లోని నటుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే రీతిలో వెంకీ అట్లూరి ఎన్టీఆర్ కోసం ఒక లార్జర్ దన్ లైఫ్ సబ్జెక్ట్‌ను సిద్ధం చేస్తే, అది మాస్ ఇమేజ్‌ను కాపాడుతూనే నేటి ‘జెన్ జీ’ ప్రేక్షకులకు ఆయనను మరింత దగ్గర చేసే అవకాశముంది.


