ఎట్టకేలకు ‘ఓజి’ శాటిలైట్ రైట్స్ ఆ ఛానల్‌కే..?

ఎట్టకేలకు ‘ఓజి’ శాటిలైట్ రైట్స్ ఆ ఛానల్‌కే..?

Published on May 27, 2026 8:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ఓజి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ స్టైలిష్ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజి పాత్రలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఈ చిత్రానికి థమన్ సాలిడ్ మ్యూజిక్ తోడవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

అయితే, ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ, ఈ మూవీ శాటిలైట్ రైట్స్ మాత్రం ఇంకా అమ్ముడు కాలేదని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఏ టీవీ ఛానల్‌లో వస్తుందా అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం లభించిందట. ప్రముఖ ఛానల్ ఈటీవీ ‘ఓజి’ చిత్ర శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక త్వరలోనే ఓజి శాటిలైట్ స్ట్రీమింగ్ కూడా జరగబోతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటించాడు. మరి ఈ సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు