‘ఉస్తాద్ భగత్ సింగ్’పై పవన్ నిర్ణయం ఇదేనా..?

‘ఉస్తాద్ భగత్ సింగ్’పై పవన్ నిర్ణయం ఇదేనా..?

Published on Apr 26, 2025 8:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇందులో ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ చిత్రాలను ఆయన ముందుగా పూర్తి చేస్తాడట. ఇక ఈ సినిమాల తర్వాత ఆయన దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను స్టార్ట్ చేస్తాడు.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదట్నుంచి సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్-హరీష్ కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాపై తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా కోసం పవన్‌కు మైత్రి మూవీ మేకర్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ రెమ్యునరేషన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కూడా ఆయన వీలైనంత త్వరగా ముగించి, సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని పవన్ ఆలోచిస్తున్నాడట. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను పవన్ చేస్తుండటంతో అభిమానులు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఆయన బ్రేక్ తీసుకోవడం కొంతమేర నిరాశ కలిగిస్తుందని వారు అంటున్నారు. ఏదేమైనా పవన్ నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు