టాలీవుడ్‌కు మరో సాలిడ్ విలన్ దొరికినట్లే..!

టాలీవుడ్‌కు మరో సాలిడ్ విలన్ దొరికినట్లే..!

Published on May 26, 2026 2:00 AM IST

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో ‘మున్నాభాయ్’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నార్త్ నటుడు దివ్యేందు శర్మ ఇప్పుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’లో ఆయన నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. బుచ్చిబాబు ‘మీర్జాపూర్’ ఫ్యాన్ కావడంతో, రామ్ చరణ్‌ను ఢీకొట్టే ఈ ‘రామ్ బుజ్జి’ పాత్ర కోసం ఎన్నో ఆప్షన్ల తర్వాత దివ్యేందును ఎంపిక చేసుకున్నాడు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌లో ఈ పాత్రకు మంచి ఎలివేషన్లు లభించాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పరభాషా విలన్ల ట్రెండ్ తగ్గిన తరుణంలో వస్తున్న ఈ కుర్ర విలన్ పాత్ర క్లిక్ అయితే, ఇండస్ట్రీకి ఒక మంచి ఆప్షన్ దొరికినట్లే. తన టాలీవుడ్ ఎంట్రీపై దివ్యేందు స్పందిస్తూ.. ‘రామ్ చరణ్‌తో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది. ‘రంగస్థలం’లోనే కాకుండా ‘పెద్ది’ సెట్స్‌లోనూ ఆయన నటన నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నాకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది’ అని ధీమా వ్యక్తం చేశాడు.

తాజా వార్తలు