ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు మూవీ.. ఆ బ్యానర్ లోనే..?

ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు మూవీ.. ఆ బ్యానర్ లోనే..?

Published on Jun 26, 2026 1:00 AM IST

LIK

‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన గత చిత్రం LIK ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ, ప్రదీప్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆయన మరో క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

‘డ్యూడ్’ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో సినిమా చేయడానికి ప్రదీప్ అంగీకరించగా.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లాక్ అయిందట. విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఆయన చెప్పిన లైన్ నచ్చడంతో ప్రదీప్ రంగనాథన్ ఈ ప్రాజెక్ట్‌కు వెంటనే ఓకే చెప్పాడట.

ప్రదీప్‌కు తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ ఉండటంతో ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రారంభించి, వచ్చే ఏడాది రెండు భాషల్లోనూ ఒకేసారి భారీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే మరిన్ని అధికారిక వివరాలు వెలువడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు