మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ యాక్షన్ డ్రామా ‘మెగా158’ షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో శరవేగంగా జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మొదట మలయాళ బ్యూటీ హనీ రోజ్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఆమె స్థానంలో కన్నడ హీరోయిన్ రచితా రామ్‌ను లైన్‌లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘కూలీ’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రచితా రామ్, ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.
ఇక ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె పాత్రలో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రంతో టాలీవుడ్‌లోకి నేరుగా అడుగుపెడుతోంది.


