సౌత్ సినిమాల్లో విలన్, క్యారెక్టర్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ విజయ్ సేతుపతి. వెర్సటైల్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నా ఆయన. ఇక ఆయన తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే, టాలీవుడ్‌లో రూపొందుతున్న క్రేజీ చిత్రాల్లో ‘రౌడీ జనార్థన’ కూడా ఒకటి.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు రవికిరణ్ కోలా కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ తొలుత సేతుపతినే సంప్రదించారట. నిర్మాత దిల్ రాజు ఆయన అడిగినంత పారితోషకం ఇవ్వడానికి సిద్ధపడి, డేట్ల కోసం నెలల తరబడి ఎదురుచూశారని తెలుస్తోంది. కానీ, వరుస ప్రాజెక్టుల వల్ల విజయ్ సేతుపతి ఎంతకీ అందుబాటులోకి రాలేకపోయాడట.
ఈ చిత్రం డిసెంబరులో విడుదల కావాల్సి ఉండటంతో.. ఇక ఆలస్యం చేయడం కుదరదని చిత్ర బృందం ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపింది. సేతుపతి స్థానంలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్‌ను ఆ విలన్ పాత్రకు ఎంపిక చేయాలని టీమ్ భావిస్తోందట. ఇటీవలే ‘బైకర్’ చిత్రంలో తండ్రి పాత్రతో మెప్పించిన రాజశేఖర్ అయితేనే ఈ పాత్రకు సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారు. మరి నిజంగానే సేతుపతి ప్లేస్‌ను రాజశేఖర్ రీప్లేస్ చేస్తాడా అనేది వేచి చూడాలి.


