రజనీకాంత్ నెక్స్ట్ మూవీపై కొత్త బజ్.. లుక్‌తోనే రఫ్ఫాడించేయనున్న తలైవా..!

రజనీకాంత్ నెక్స్ట్ మూవీపై కొత్త బజ్.. లుక్‌తోనే రఫ్ఫాడించేయనున్న తలైవా..!

Published on Jun 10, 2026 12:01 AM IST

Rajinikanth

సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవర్ 173’ ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొదట ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయాల్సిన సుందర్ సి స్థానంలోకి సిబి చక్రవర్తి వచ్చాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు చెప్పిన స్క్రిప్ట్ రజనీకాంత్‌కు బాగా నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో రజనీకాంత్ ఒక వైవిధ్యమైన లుక్‌లో కనిపించబోతున్నాడని, ఆయన పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక డాక్టర్ పాత్రను పోషిస్తున్నాడట. ఇందుకోసం రజనీకాంత్‌పై ప్రత్యేకంగా ఒక ఫోటోషూట్ నిర్వహించి, ఆయన లుక్‌ను మేకర్స్ ఫైనలైజ్ చేశారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ సరికొత్త లుక్‌ను అధికారికంగా విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుతం చెన్నైలోని పూనమల్లిలో ఈ సినిమా కోసం ఒక భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, టెక్నికల్ క్రూ ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. కమల్ హాసన్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

తాజా వార్తలు