మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇటీవల నటించిన ‘పెద్ది’ చిత్రం ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో అథ్లెట్‌గా చరణ్ లుక్, పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. చరణ్‌ను బెస్ట్ లుక్‌లో ప్రెజెంట్ చేస్తూ.. ఒక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామాను అందించినందుకు దర్శకుడు బుచ్చిబాబుపై ప్రశంసల జల్లు కురిసింది.
అయితే, ఈ సినిమా రిలీజ్‌కు ముందే చరణ్ బుచ్చిబాబుకు మరో సినిమా చేసే అవకాశం ఇస్తానని ప్రామిస్ చేసినట్లు అప్పట్లో గట్టిగా ప్రచారం సాగింది. తాజా సమాచారం ప్రకారం, ఆ ప్రామీస్‌ను చరణ్ నిలబెట్టుకుంటున్నాడట. టాలీవుడ్‌కి చెందిన ఒక టాప్ ప్రొడ్యూసర్‌ను బుచ్చిబాబుకు భారీ అడ్వాన్స్ ఇవ్వాల్సిందిగా చరణ్ స్వయంగా రికమండ్ చేసినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబుకు ఇప్పటికే ఆ అడ్వాన్స్ కూడా అందిందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కోసం ఆఫీస్ ఓపెన్ చేసి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయనున్నాడని టాలీవుడ్ టాక్.
సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ మళ్లీ బుచ్చిబాబు తో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌తో పెద్ది రికార్డులను అధిగమించాలని ఈ డైరెక్టర్, హీరో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిన్న బ్రేక్‌లో ఉన్న చరణ్.. వచ్చే ఏడాది ఆరంభంలో సుకుమార్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. మరి నిజంగానే ‘పెద్ది’ కాంబో మరో పెద్ద సినిమాతో అలరిస్తారా..? అనేది వేచి చూడాలి.


