దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోయే ప్రతిష్టాత్మక చిత్రం ‘జై హనుమాన్’(Jai Hanuman )ఫిబ్రవరి 22, 2026న హంపిలో ఘనంగా ప్రారంభం కానుంది. ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్‌లో మొదలవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రూపొందించేందుకు ప్రశాంత్ వర్మ భారీ క్యాస్టింగ్‌ను తీసుకోనున్నాడట. ఈ క్రమంలో రానా దగ్గుబాటి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన విభిన్న గెటప్పులలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా, దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా ఈ పాన్-ఇండియా చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


