దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశాడు. ఈ క్రేజీ చిత్రానికి హీరో నానినే నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.
అయితే, ఈ రెండు సినిమాల విషయంలో శ్రీకాంత్ ఓదెల ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ‘ప్యారడైజ్’ కథకు, చిరంజీవితో చేయబోయే సినిమా స్టోరీకి ఒక బలమైన లింక్ ఉందట. ఈ లింక్ ‘ప్యారడైజ్’ క్లైమాక్స్‌లో రివీల్ కాబోతున్నట్లు తెలుస్తోంది. చిరు ఈ సినిమాలో నేరుగా కనిపించకపోయినా, ఆయన సినిమాకు సంబంధించిన ఒక గట్టి లీడ్ లేదా హింట్ ‘ప్యారడైజ్’ ముగింపులో ఉంటుందని సమాచారం. అంతేకాదు, ఈ కథకు ఒక ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్.
రక్తపాతాన్ని కూడా ఎంతో స్టైలిష్‌గా, ‘రా’ గా చూపించడంలో శ్రీకాంత్ ఓదెలకు ఒక ప్రత్యేక శైలి ఉంది. ‘ప్యారడైజ్’ సినిమాలో నాని క్యారెక్టర్, డైలాగులు చాలా బోల్డ్‌గా, ఊరమాస్‌గా ఉండబోతున్నాయట. ఇదే వయిలెంట్ ఎఫెక్ట్ చిరు సినిమాతోనూ కంటిన్యూ కానుంది. గతంలో విడుదల చేసిన చిరు సినిమా ప్రీ లుక్ పోస్టర్‌లో ‘చేతినిండా రక్తంతో’ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో దర్శకుడు ఇప్పటికే హింట్ ఇచ్చాడు. మరి నిజంగానే ఈ రెండు సినిమాలకు శ్రీకాంత్ లింక్ పెడతాడా అనేది వేచి చూడాలి.


