‘ది ప్యారడైజ్’ షూటింగ్ అప్డేట్.. ఇంకా సమయం పడుతుందా..?

‘ది ప్యారడైజ్’ షూటింగ్ అప్డేట్.. ఇంకా సమయం పడుతుందా..?

Published on Jun 10, 2026 2:00 AM IST

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న ఆగస్టు 21 డేట్ నుండి ఈ సినిమా తప్పుకుందట. ఇప్పటివరకు 120 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మిగిలిన 60 రోజుల ఆఖరి షెడ్యూల్‌ను నేటి(జూన్ 9) నుంచే విరామం లేకుండా ప్రారంభించింది.

ప్రస్తుతం ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్, ఈసారి ఎలాంటి ఆలస్యం చేయవద్దని మేకర్స్‌పై ఒత్తిడి తెస్తోంది. ఎస్ఎల్‌వి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడే. కొత్త రిలీజ్ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

తాజా వార్తలు