‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆరోజేనా..?

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) విడుదలకు ముహూర్తం ఖరారైంది. గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 22న అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రెండు రోజుల సమయాన్ని కేటాయించారని తెలుస్తోంది. పవర్ స్టార్ స్వయంగా ప్రచార బరిలోకి దిగుతుండటంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగిపోతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పార్తీబన్ విలన్‌గా కనిపిస్తుండగా, గౌతమి, అశుతోష్ రాణా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 26న పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.

Exit mobile version