బాలయ్య కోసం మరోసారి బాలీవుడ్ బ్యూటీ..?

బాలయ్య కోసం మరోసారి బాలీవుడ్ బ్యూటీ..?

Published on May 9, 2026 1:00 AM IST

Nandamuri-Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో NBK111 చిత్రాన్ని ప్రారంభించాడు బాలయ్య. ఇక ఈ సినిమా పూర్తి కాకముందే మరో డైరెక్టర్ కొరటాల శివతో తన కెరీర్‌లోని 112వ చిత్రాన్ని ప్రకటించాడు. ఇప్పుడు ఈ సినిమాపై నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది.

బాలయ్య కోసం కొరటాల ఎలాంటి కథను పట్టుకొస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కి్ల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్‌ను తీసుకునేందుకు కొరటాల అండ్ టీమ్ రెడీ అయ్యారట. గతంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో విద్యా బాలన్ ఆయన పక్కన నటించింది. అప్పుడు వారి కాంబినేషన్ కొత్తగా అనిపించింది.

దీంతో ఇప్పుడు మేకర్స్ మరోసారి ఈ కాంబో సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో మరోసారి బాలయ్య పక్కన విద్యా బాలన్ ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు