రజినీకాంత్‌తో తెలుగు యంగ్ డైరెక్టర్ మూవీ..?

రజినీకాంత్‌తో తెలుగు యంగ్ డైరెక్టర్ మూవీ..?

Published on May 18, 2025 12:00 AM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. ఇక ఇప్పుడు రజినీకాంత్ ఓ యంగ్ టాలీవుడ్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ త్వరలోనే రజినీకాంత్‌తో ఓ సినిమా చేయనున్నాడనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రజినీతో ఓ సినిమాకు రెడీ అయ్యారని.. అయితే, ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతను వివేక్ ఆత్రేయకు అప్పగించినట్లు తెలుస్తోంది.

మరి నిజంగానే వివేక్ ఆత్రేయ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేస్తాడా.. ఒకవేళ ఆయన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తే, ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు