భారీ రేటుకు ‘వృషకర్మ’ నాన్-థియేట్రికల్ రైట్స్..?

VRUSHAKARMA

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మిస్టికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ నాన్-థియేట్రికల్ హక్కులను ప్రముఖ సంస్థ జీ నెట్‌వర్క్ ఏకంగా రూ. 48 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చైతూ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డీల్ అయిన ఈ బిజినెస్‌తో, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం రికవరీ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి.

‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ చిత్రాన్ని 2026 చివర్లో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version