‘నా పేరు సూర్య’ ఆడియో విడుదల తేది ఖరారు ?

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్స్ గా వ‌క్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో లగడపాటి శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. కేవలం ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఏప్రిల్ 15న జరపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫంక్షన్ ఎక్కడ ఉండబోతోంది అన్న విషయంపై క్లారిటి లేదు. త్వరలో అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. విశాల్ – శేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.