జాతి రత్నాలు పై భారీ అంచనాలు !

Published on Mar 2, 2021 12:09 am IST

టాలెంటెడ్ యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో వెండితెర పై ఎంట్రీ ఇవ్వ‌డమే కాకుండా, తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. జాతిరత్నాలు సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మార్చి 11న రిలీజ్ కాబోతుంది. దాంతో మేకర్స్ ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు. ప్రమోషన్ల సాధారణ నిబంధనలను పక్కన పెట్టి, మేకర్స్ తమ సినిమాను జనంలోకి తెచ్చే ప్రయత్నాలు చూస్తున్నారు.

కాగా ఈ రోజు, చిత్రబృందం హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాలలో మాస్క్ లు పంపిణీ చేస్తూ ఈ చిత్రం గురించి చెబుతున్నారు. ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ చాల బాగా వచ్చిందని.. ఫుల్ ఎంటర్ టైనర్ గా సూపర్ హిట్ గా నిలుస్తోందట. ఏమైనా జాతిరత్నాలు గాని హిట్ నవీన్ రేంజ్ మారిపోతుంది. హీరోగా అతనికి ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే ఈ టాలెంటెడ్ యంగ్ హీరో కామెడీ టైమింగ్‌కి చాలామంది ఫిదా అయిపోయి ఫ్యాన్స్‌గా మారిపోయారు.

సంబంధిత సమాచారం :