కమల్ తప్ప మరొకరు ఈ సినిమా చేయలేరు : సి. కళ్యాణ్

కమల్ తప్ప మరొకరు ఈ సినిమా చేయలేరు : సి. కళ్యాణ్

Published on May 4, 2015 7:22 PM IST

C-kalyan1
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ఉత్తమ విలన్’. ఎప్పట్నుంచో వివాదాలను ఎదుర్కొంటూ వస్తోన్న ఈ సినిమా చివరకు అన్ని అడ్డంకులను దాటుకొని శనివారం సాయంత్రానికి విడుదలైంది. నిజానికి ఈ సినిమా శుక్రవారమే (మే 1న) విడుదల కావాల్సింది. చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా ఆరోజు విడుదలకు నోచుకోలేదు. ఇక విడుదల ఇప్పుడంటూ, అప్పుడంటూ చెలరేగిన గందరగోళం మధ్యే ఈ సినిమా శనివారం సాయంత్రం విడుదలైంది.

విడుదల తర్వాత ఈ సినిమాకు విశ్లేషకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. కమల్ హాసన్ అందించిన కథకు అందరినుంచీ ప్రశంసలు దక్కుతున్నాయి. కమల్ హాసన్ నటన విషయంలో వంక పెట్టలేమన్నది అందరూ ఏక కంఠంతో చెబుతున్న అభిప్రాయం. ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలైన ‘ఉత్తమ విలన్’ విశేషాల గురించి ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాత సి. కళ్యాణ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఎంతోమంది కష్టపడితే తెరకెక్కిన ఈ సినిమా ఇలా విడుదల కష్టాలను ఎదుర్కోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాను కమల్ హాసన్ లాంటి డెడికేషన్ ఉన్న నటుడు తప్ప మరెవరూ చేయలేరని సి. కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆండ్రియా, పూజా కుమార్‌లు నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు