భారీ ధరకు.. ‘ఉత్తమ విలన్’ తెలుగు రైట్స్!

భారీ ధరకు.. ‘ఉత్తమ విలన్’ తెలుగు రైట్స్!

Published on Mar 16, 2015 11:45 AM IST

Uttama-Villain
సరికొత్త పాత్రలతో, కథాంశాలతో మనల్ని ఎంతగానో అలరించిన దేశం గరించదగ్గ నటుడు.. కమల్ హాసన్. ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ఉత్తమ్ విలన్.. ఏప్రిల్ 10న విడుదల అవనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, దర్శకుడు లింగుస్వామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే కమల్ హాసనే సమకూర్చడం విశేషం. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ విభిన్నంగా కనిపిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాను తెలుగులో సి. కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను 8కోట్లకు పైనే చెల్లించి సి. కళ్యాణ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం కమల్.. ఏపీ, తెలంగాణాల్లోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ చేయని రీతిలో ఒక డబ్బింగ్ సినిమా ప్రమోషన్‌ను భారీ స్థాయిలో జరపనున్నారని సమాచారం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు