లేటెస్ట్…భారతీయుడు 2 నుండి క్యాలెండర్ సాంగ్ రిలీజ్!

లేటెస్ట్…భారతీయుడు 2 నుండి క్యాలెండర్ సాంగ్ రిలీజ్!

Published on Jul 1, 2024 6:36 PM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇండియన్ 2. తెలుగులో భారతీయుడు 2 గా జూలై 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నుండి మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ను నేడు రిలీజ్ చేయడం జరిగింది. క్యాలెండర్ సాంగ్ ను అనిరుద్ రవి చందర్ చాలా డిఫెరెంట్ గా కంపోజ్ చేశారు. ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించేలా ఈ సాంగ్ ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, SJ సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు