డేట్స్ ఇవ్వగలదా.. ఆలోచనలో ప్రభాస్ టీమ్ !

Published on Mar 29, 2021 9:53 am IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘దీపికా పడుకోణె’ పెళ్లి అయ్యాకే ఫుల్ బిజీ అయిపోయింది ఈ భామ. ప్రస్తుతం దీపక చేతిలో ఏకంగా ఆరు సినిమాలున్నాయట. పైగా దీపక చేస్తోన్న సినిమాలు అన్ని భారీ సినిమాలే. అన్ని సినిమాల్లోనూ స్టార్ హీరోలే. అయితే వారి డేట్స్ కి అనుగుణంగా దీపక తన డేట్స్ ను ఎడ్జెస్ట్ చేయలేకపోతుందట. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాకి అనుకున్న టైంకి డేట్స్ ను దీపికా ఇవ్వగలదా అని ప్రభాస్ – నాగ్ అశ్విన్ టీమ్ ఆలోచనలో పడిందట.

ఇంతకీ దీపికా చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ డైరెక్క్షన్లో మూవీ, హృతిక్ రోషన్ తో “ఫైటర్”, అలాగే షారుక్ హీరోగా “పఠాన్”, మరియు శకున్ బాత్రా డైరెక్షన్లో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా ఒక రొమాంటిక్ డ్రామా, మహాభారత్, అలాగే ఒక హాలీవుడ్ మూవీ రీమేక్ ఇలా ఉంది ఆమె సినిమాల లిస్ట్. ఏది ఏమైనా దీపికా మాత్రం ఎక్కడా గ్యాప్ లేకుండా సినిమాలు ఒప్పుకుంటూ పోతుంది.

సంబంధిత సమాచారం :