వారికి పూజా రెస్పాన్స్ ఇస్తుందా?

Published on May 29, 2020 11:02 pm IST

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే నుంచి వచ్చిన ఊహించని షాక్ మరింత స్థాయికి చేరుకునేలా ఉంది. తన కో స్టార్ హీరోయిన్ సమంత పై తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో దర్శనం ఇచ్చిన పోస్ట్ రేపిన సెన్సేషన్ ఇంకా కొనసాగుతుంది.

ఆ పోస్ట్ అనంతరం సర్కాస్టిక్ గా సమంత, దర్శకురాలు నందిని రెడ్డి అలాగే సింగర్ చిన్మయిలు సోషల్ మీడియాలో చేసిన ఓ కాన్వర్జేషన్ హాట్ టాపిక్ అయ్యింది.

ఒకరి పేర్లు ఒకరు మార్చుకొని తమ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ ముగ్గురు మొదలు పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఇది పరోక్షంగా పూజా వరకే అన్నట్టు ప్రతీ ఒక్కరికీ అర్ధం అయ్యింది. మరి దీనిపై పూజా ఏమన్నా రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More