విశాల్ తో కలిసి తమన్నా’యాక్షన్’ ఇరగదీస్తుందట.

విశాల్ తో కలిసి తమన్నా’యాక్షన్’ ఇరగదీస్తుందట.

Published on Sep 14, 2019 8:34 AM IST

విశాల్ లేటెస్ట్ మూవీ యాక్షన్ టీజర్ నిన్న విడుదలైంది. ఒక నిమిషానికి పైగా ఉన్న టీజర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో సాగింది. యాక్షన్ మూవీ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుందని టీజర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది. చేజింగ్స్, రన్నింగ్స్, ఫైటింగ్స్ తో సాగిన యాక్షన్ టీజర్ ఉత్కంఠ భరితంగా ఉంది. విశాల్ 2008లో చేసిన సెల్యూట్ లాంటి ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తరువాత ఈ చిత్రంలో మరలా ఆ తరహా చిత్రంలో నటిస్తున్నారనిపిస్తుంది.

ఐతే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా విశాల్ తో కలిసి యాక్షన్ సన్నివేశాలలో నటించారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కొన్ని చేసింగ్ సన్నివేశాలలో తమన్నా విశాల్ కలిసి నటించారు. అలాగే ఈ చిత్రంలో విశాల్, తమన్నా అండర్ కవర్ కాప్స్ గా కనిపించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో యాక్షన్ మూవీలో తమన్నా గ్లామర్ తోనే కాకుండా యాక్షన్ సన్నివేశాలలో కూడా ఇరగదీయనుందని వినికిడి. దర్శకుడు సి. సుందర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మరో హీరోయిన్ గా ఐశ్వర్య లేక్ష్మి నటిస్తుండగా, హిప్ హాఫ్ తమీజ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు