మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. తాజాగా తన ధృవ సినిమా సెట్స్ లో దిగిన ఫోటోలను ట్వీట్ చేస్తూ.. ధృవ సినిమా సెట్స్ లోని త్రో బ్యాక్ పిక్స్ ఇవి. సెట్స్ కి తిరిగి వెళ్ళడానికి ఇక వేచి ఉండలేను. అయితే అప్పటి వరకు, ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలి’ అంటూ చరణ్ పోస్ట్ చేశాడు.
ఇక భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన వీడియోలో.. చరణ్ పాత్రధారి ‘అల్లూరి’ గురించి గ్రాండ్ ఎలివేషన్స్ షాట్స్ అండ్ భారీ విజువల్స్ అలాగే చరణ్ యాక్షన్ స్టంట్స్ అదిరిపోయాయి. ఫ్యాన్స్ ఆసక్తిని ఇంకా డబుల్ రెట్టింపు చేస్తూ అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా చరణ్ సిక్స్ ఫ్యాక్ తో అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు.
ఇక దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ తరువాత చరణ్ చేయబోయే సినిమా పై చాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చరణ్ ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడో చూడాలి .
Throwback to #Dhruva shoot. Can't wait to be back on sets. Till then, stay home and stay safe. pic.twitter.com/ZlaHcad8jn
— Ram Charan (@AlwaysRamCharan) May 16, 2020


