‘కేరాఫ్ కంచెర పాలెం’ అనే అతి చిన్న సినిమాతో ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు నూతన దర్శకుడు వెంకటేష్ మహా. కాగా మహా తన తరువాత సినిమాగా ఓ మలయాళ సినిమాని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ సినిమానే వెంకటేష్ మహా తెలుగులోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా పూర్తి ప్రతీకార ఛాయలున్న సినిమా అని తెలుస్తోంది.
కాగా ఈ రీమేక్ సినిమాలో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చాల భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల నాలుగో వారానికి మొత్తం చిత్రీకరణను పూర్తి చేసుకోనుంది. ‘మహేషింటె ప్రతీకారం’ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. అయితే ఈ సినిమా మాహా చాల వినూత్నంగా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది.
ఇక ‘కేరాఫ్ కంచెర పాలెం’ ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శింపబడింది. అలాగే ఇటివలే ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్’లో కూడా ఈ సినిమా ప్రదర్శింపబడింది. మొత్తానికి ఈ చిన్న సినిమాతోనే మహా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు.


