ఇబ్బందుల్లో పడిన టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు

Published on Mar 13, 2020 9:46 pm IST

మన తెలుగు స్టార్ హీరో హీరోయిన్లకు కొత్త ఇబ్బంది వచ్చి పడింది. ప్రతి వేసవికి మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, నాగర్జున లాంటి హీరోలు కుటుంబాలతో కలిసి విదేశాలకు ఎగిరిపోతుంటారు. అలాగే హీరోయిన్లు కాజల్, రకుల్ ప్రీత్, సమంత, శ్రియలు కూడా వేసవిని విదేశాల్లోనే గడుపుతుంటారు. కానీ ఈసారి మాత్రం వారికి ఆ వెసులుబాటు దొరికేలా లేదు. కారణం కరోనా వైరస్.

ఇప్పటికే అనేక దేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఆయా దేశాలు టూరిస్ట్ వీసాలకు అనుమతులు ఇవ్వడంలేదు. దీంతో కొన్ని నెలల క్రితమే సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకున్న మన తారలు వాటిని రద్దు చేసుకునే పరిస్థితి. కొందరైతే రిస్క్ తీసుకోవడం ఎందుకని విదేశీ టూర్లను ఇప్పటికే విరమించుకున్నారు. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం ఉండటంతో లోకల్ టూరిస్ట్ ప్రదేశాలను కూడా ఎవాయిడ్ చేయాల్సిన పరిస్థితి. సో.. ఈ వేసవికి మన స్టార్లంతా ఎక్కడి వాళ్లక్కడే ఉండిపోనున్నారు.

సంబంధిత సమాచారం :

More