ఆ ట్వీట్స్ చేసినందుకు పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టారు !

Pawan_Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ట్విట్టర్ వేదికగా ప్రతి సినిమా హాల్లోనూ షో మొదలవడానికి ముందు జాతీయ గీతం తప్పక ఆలపించాలి అనే సుప్రీం కోర్ట్ ఆదేశాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశాడు. పవన్ తన ట్వీట్ల ద్వారా ‘కుటుంబంతో, స్నేహితులతో సినిమా చూస్తూ సరదాగా గడపాల్సిన సాయంత్రం దేశభక్తిని నిరూపించుకోవాల్సిన సమయంగా మారింది’ అంటూ సుప్రీం కోర్ట్ ఆదేశం పట్ల నిరుత్సాహాన్ని తెలియజేశారు.

అలాగే ‘కేవలం సినిమా హాళ్లలోనే జాతీయ గీతం ఎందుకు పాడాలి. ప్రతి రోజు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు తమ విధులను జాతీయ గీతం ఆలపించి ఎందుకు మొదలుపట్టవు, ప్రజలకు ఉదాహరణలుగా ఎందుకు నిలవవు. అంటే చట్టం చేసే వాళ్ళు కేవలం హెచ్చరిక సంకేతాలు మాత్రమేనా’ అంటూ గట్టిగా ప్రశించాడు. దాంతో జాతీయ గీతాన్ని, సుప్రీం కోర్టు ఆదేశాల్ని అగౌరవపరుస్తున్నారంటూ హైకోర్టు లాయర్ ఒకరు హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పవన్ కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే జాతీయ గీతం అంశం పట్ల అరవింద స్వామి, రామ్ గోపాల్ వర్మలు ట్విట్టర్ ద్వారా తమ వ్యతిరేకతను తెలిపిన సంగతి విధితమే.