‘చమ్మక్ చల్లో’, ‘పైసా’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలతో తెలుగు కుర్రకారుని ఆకట్టుకున్న హీరోయిన్ కేథరిన్ ట్రేస. కేథరిన్ కి తెలుగు సరైన కమర్షియల్ హిట్ లేకపోయినప్పటికీ వరుసగా ఆఫర్లు మాత్రమే చేజిక్కించుకుంటోంది. ఇప్పటి వరకూ తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో మాత్రమే సినిమాలు చేసిన కేథరిన్ ‘మద్రాస్’ సినిమాతో తమిళ చిత్ర సీమకి కూడా పరిచయం కానుంది. కార్తి హీరోగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కేథరిన్ నటించిన ‘మద్రాస్’ సినిమా విడుదల కాకముందే తమిళంలో కేథరిన్ కి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా జయం రవి హీరోగా సూరజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చాన్స్ వచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఈ మూవీలో ఒక హీరోయిన్ గా అంజలిని సెలక్ట్ చేసారు. ఇందులో కేథరిన్ రోల్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ చిత్ర టీంకి కేథరిన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ ఈ సినిమాపై కేథరిన్ ఆసక్తి చూపుతోందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇది కాకుండా ఇటీవలే కేథరిన్ తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించనున్న ‘ఎర్రబస్సు’ సినిమాకి సైన్ చేసింది. దాసరి నారాయణరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.


