త్రిష ప్లేస్‌లో కాథరిన్ థెరిసా..!

త్రిష ప్లేస్‌లో కాథరిన్ థెరిసా..!

Published on May 12, 2015 12:54 PM IST

catherine-tresa
ప్రముఖ సినీ దర్శకుడు సెల్వ రాఘవన్ శింబుతో ఓ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. తాప్సీ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించనున్న ఈ తమిళ సినిమాకు హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా త్రిష ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసింది. ఈ ప్రాజెక్టు నుంచి త్రిష తప్పుకోవడం పట్ల రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో త్రిష స్థానంలో క్యాథరీన్ థెరిసా హీరోయిన్‌గా ఎంపికైంది.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ద్వారా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న క్యాథరీన్, ఈ క్రేజ్ ఆఫర్ తనకు రావడం పట్ల సంతోషంగా ఉంది. తెలుగు, తమిళం ఇలా రెండు భాషల్లోనూ నటించినా ఇప్పటికీ క్యాథరీన్‌‌ తనను తాను నిరూపించుకునే పాత్ర చేయలేదు. విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో నటిగా మంచి గుర్తింపు దక్కుతుందని కాథరిన్ భావిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

తాజా వార్తలు