
తెలుగు సినీ అభిమానులు రెగ్యులర్ సినిమాలకంటే విభిన్న తరహా కథలతో వారిని మెప్పించేలా చేస్తేనే సినిమాని హిట్ చేస్తున్నారు అనే ఫార్ములాని బలంగా నమ్మి అదే తరహాలో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నిఖిల్.. ఇటీవలే శంకరాభరణం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమా తర్వాత నిఖిల్ ‘టైగర్’ ఫేం విఐ ఆనంద్ తో కలిసి తన తదుపరి సినిమా చేయనున్నాడు. గత నెలలో ప్రారంభమైన ఈ సినిమా ఈ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కి అవకాశం ఉందని ఇదివరకే తెలియజేశాం. ఇప్పటికే తాప్సీ, అవిక గోర్ లని సెలక్ట్ చేసామని చెప్పాం. తాజాగా మూడవ హీరోయిన్ కోసం మరో భామని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. దాని కోసం కుమారి 21F తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హేభ పటేల్ ని పరిశీలిస్తున్నారు. అలాగే ఈ పాత్ర కోసం కేథరిన్ ట్రేసని కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ ముగ్గురు భామలని ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేయనున్నారు. ఫాంటసీ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనుంది.

