యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ప్రస్తుతం ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరణను ప్లాన్ చేసింది చిత్రబృందం. కాగా ఈ స్పెషల్ సాంగ్ లో నటించడానికి చిత్రబృందం మొదటిగా ‘ఇలియానా’ని సంప్రదించింది. అయితే సాంగ్ లో నటించడానికి ఒప్పుకున్నా ఈ గోవా బ్యూటీ, రెమ్యూనిరేషన్ని భారీ మొత్తంలో డిమాండ్ చేసింది.
దాంతో చిత్రబృందం ఇక మళ్ళీ ఆమెను పక్కన పెట్టి యంగ్ హీరోయిన్ క్యాథరిన్ థ్రెసాను తీసుకోవాలని నిర్ణయించారు. క్యాథరిన్ గతంలో బోయపాటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ ‘వినయ విధేయ రామ’ చిత్రం సంక్రాంతికి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.
