బొగ్గు కుంభకోణంలో దాసరిపై అభియోగ పత్రం

Dasari

తెలుగు చలన చిత్ర సీమకి ఒక పిల్లర్ లా నిలబడిన వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు. దాసరి ఒక దర్శకుడిగానే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు. అప్పుడు జరిగిన ఓ కుంభకోణం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. కాంగ్రెస్ హయాంలో జరిగిన జార్ఖండ్ లోని జిందాల్ కంపెనీకి చెందిన బొగ్గు గనుల కేటాయింపుల్లో దాసరి నిందితుడు. ఈ భారీ బొగ్గు కుంభకోణంలో దాసరికి కూడా భాగస్వామ్యం ఉందని ఆయన్ని కూడా ఈడీ విచారణ జరిపింది. అంతే కాకుండా దాసరి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా రంగం సిద్దం చేసుకుంది.

ఫైనల్ గా ఈ సీబీఐ కేసు విచారణని ముగించింది. బొగ్గు కుంభకోణం పై కేంద్ర దర్యాప్తు టీం ఈ రోజు అభియోగా పత్రం దాఖలు చేసింది. ఈ అభియోగా పత్రంలో 14 మంది పేర్లను పొందు పరిచింది. అందులో నవీన్ జిందాల్ తో పాటు మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, ఎస్.సి గుప్తా తదితరులు ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచో ఈ బొగ్గు కుంభకోణం దాసరి మెడకి చుట్టుకుంటోందని అంటూనే వస్తున్నారు. అన్నట్టుగానే ఆయనపై అభియోగ పత్రం నమోదైంది. దాసరి పేరు అభియోగాపత్రం లో దాఖలు చేయడం వలన ఇకపై ఆయన ఆస్తులను జప్తు చేసి, ఈ కేసును కోర్టుకి పంపడం జరుగుతుంది. మరి మన దాసరి గారిపై మోపిన ఈ అభియోగపత్రంపై ఆయన ఎలాంటి కామెంట్ చేస్తారో చూడాలి.

Exit mobile version